రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ నామినేషన్ దాఖలు

posted on: Jun 28, 2012 12:31PM

రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, రాహుల్ గాంధీ, ములాయం, లాలూ తదితరులు హాజరయ్యారు. కాగా కార్యాలయంలోనికి 17 మందినే లోపలికి అనుమతించడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ కార్యాలయం వెలుపలే వేచివున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...