మంత్రులకు పార్టీ, ప్రభుత్వ ప్రచార బాధ్యత!

posted on: Jun 27, 2012 11:48AM

రాష్ట్ర మంత్రులు పది మంది కలిసి కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారబాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెండే సీట్లు రావటంతో పార్టీ ప్రచార బాధ్యత మంత్రుల కమిటీ చేపట్టింది. దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వీరే ప్రచారం చేపట్టాలి. పది మంది సభ్యులున్న ఈ కమిటీకి మంత్రి థర్మాన ప్రసాదరావు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కమిటీ సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, రఘవీరారెడ్డి, పినిపేవిశ్వరూప్‌, పితాని సత్యన్నారాయణ, డికెఅరుణ, తోటనర్సింహం, సారయ్య, రామచంద్రయ్యలు ఉన్నారు. ఈ కమిటీ ప్రధానంగా పార్టీ పరిస్థితి అథ్యయనం చేసి విశ్లేషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశాలను పరిశీలిస్తుంది.

ప్రచారకార్యక్రమాలు సజావుగా సాగేందుకు దృష్టి సారిస్తుంది. 2014 ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల వాతావరణం తీసుకురావటం ఈ కమిటీ బాధ్యత. దీని కోసం ప్రచారకార్యక్రమాలు దానికి తగ్గట్టు రూపొందించుకోవటం, వాటిని పర్యవేక్షించటం ఈ కమిటీ సభ్యులు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి సిఎం మద్దతు ఇస్తారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...