సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో చరమాంకం!

posted on: Jun 26, 2012 6:08PM

singareni collieries union, singareni workers union, singareni union elections 2012, singareni recognised unions, trs party singareni elections, singareni elections harish rao, cpi narayana singareni elections దేశవ్యాప్తంగా నల్లనేలగా గుర్తింపునందుకున్న సింగరేణి బొగ్గుగనుల కార్మికసంఘ గుర్తింపు ఎన్నికలు ఉప ఎన్నికల కన్నా ఘాటుగా మారి చరమాంకానికి చేరుకున్నాయి. ఇక ఓటింగే తరువాయి. ప్రచారఘట్టం ముగిసింది. ఈ ప్రచారఘట్టంలో ఉప ఎన్నికల వాతావరణాన్ని టిఆర్‌ఎస్‌, సిపిఐ నేతలు సృష్టించారు. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేధోరణిలో టిఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రసంగించారు. ఈయన ఈ గుర్తింపు యూనియన్‌లోనూ తెలంగాణావాదాన్ని చొప్పించారు. ఇది తప్పు అని సిపిఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఎఐటియుసి తరుపున నారాయణ, టిబిజికెఎస్‌ తరుపున హరీశ్‌రావు ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఈ ప్రచారం ఆద్యంతం ప్రత్యర్థులపై విమర్శలతో ప్రత్యక్ష ఎన్నికలను తలపించాయని కార్మికులు అభిప్రాయపడ్డారు. తాము స్వేచ్ఛగా అవసరమైన యూనియన్‌ను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...