అరెస్టు భయంతో బెయిల్ కోసం జగన్ పిటిషన్

posted on: May 24, 2012 2:51PM

తనను సిబిఐ అరెస్టు చేస్తుందనే ఉద్దేశంతో ఉన్నజగన్ ముందస్తు బెయిల్ కోసం వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాదులు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ మధ్యాహ్నం వాదనలు జరిగే అవకాశముంది. ఎన్నికల ప్రచారంలో తనను అడ్డుకునేందుకు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షుడనని ఆయన అన్నారు. వైయస్ జగన్ తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదనలను ప్రారంభించారు. తనకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. సిబిఐ విచారణకు తాను భయపడబోనని, తాను విచారణకు హాజరవుతానని, తన పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...