పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిని విచారించనున్న సీబీఐ

posted on: May 19, 2012 3:21PM

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రులను విచారించేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అలాగే మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావును సీబీఐ విచారించనుంది. విచారణకు హాజరు కావాలంటూ మంత్రులకు సీబీఐ ఆదేశాలు ఇచ్చింది. పరిశ్రమలకు నీటి కేటాయింపులు, జలయజ్ఞం టెండర్లపై ప్రశ్నించే అవకాశం ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌కు కడప జిల్లాలో భూమిని కేటాయిస్తూ జారీ అయిన జీవోపై సిబిఐ గీతా రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా, జలయజ్ఝంలో పనులు కేటాయింపుతో పాటు ఇండియా సిమెంట్స్‌కు కృష్ణానది నుంచి 10 లక్షల గ్యాలన్ల నీటిని కేటాయిస్తూ అనుకూలంగా జీవో జారీ అయింది. దీనిపై పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మరి కొంత మంది ఐఎఎస్ అధికారులను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...