బాలినేనికి ఓటమి భయం!

posted on: May 19, 2012 9:31AM

ఒంగోలు శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కత్తులు దూసుకుంటున్నాయి. ఓటర్లజాబితా సవరణకు ఉన్న గడువును సక్రమంగా ఉపయోగించుకుని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ ని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం పన్నింది. దీనిలో భాగంగానే దొంగ ఓట్లు ఉన్నాయని ఓటింగ్ లో ఎక్కువగా పాల్గొనే బలహీనవర్గాల, దళితు వర్గాల ఓట్లు 4800 చెల్లవని అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని రద్దు చేయించింది. దీంతో షాక్ కు గురైన బాలినేనికి మరోషాక్ కు కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా ఇచ్చాయి. అదే ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని ఎనిమిదివేల ఇళ్ళపట్టాలు మంజూరు చేస్తే వాటిలో ఐదువేలు అనర్హులకి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వాటిని క్యాన్సిల్ చేయించింది. దీని తరువాత కాంగ్రెస్ కూడా మిగిలిన మూడువేల ఇళ్ళపట్టాలలో మరో రెండు వేల పట్టాలు సరైనవి కాదని కొట్టించేసింది. ఈ రెండు షాకులకు బాలినేని తీవ్రంగా స్పందించారు. తనతో న్యాయంగా పోటీ చేయటానికి దమ్ముంటే రాష్ట్రముఖ్యమంత్రే రావాలని సవాల్ చేశారు. ఎన్ని అరాచకాలు చేసినా తన గెలుపును ఆపటం ఆ రెండు పార్టీలకు అయ్యే పని కాదని ఘాటుగా సమాధానమిచ్చారు.

 

 

అయితే ఓటింగ్ లెక్కల ప్రకారం అసలు విద్యావంతులు కన్నా దళితులూ, బలహీనవర్గాల వారే ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొంటారన్న విషయాన్ని గమనించే కాంగ్రెస్ ఈ చర్యకు పూనుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పట్టాలు క్యాన్సిల్ చేయటంతో ఆందోళనగా ఉన్న ఓటర్లను పార్టీలు మభ్యపెట్టడం సులభామన్న సూత్రాన్ని ఆ రెండు పార్టీలు అమలు చేశాయని వారు భావిస్తున్నారు. ఏమైనా బాలినేని రాజకీయప్రస్థానానికి ఈ ఎన్నికలు కీలకమనే విషయాన్ని పరిస్థితులు నిరూపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...