Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగుదేశం టార్గెట్ లో వాయలార్ రవి?
posted on: May 19, 2012 9:14AM
వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తీవ్ర కృషి చేస్తున్న వాయిలార్ రవిపై బాణాలు ఎక్కుపెట్టడానికి తెలుగుదేశంపార్టీ సన్నాహాలు చేస్తోంది. ఆయన గత చరిత్రపై ఆరాలు తీస్తోంది. కేరళలో ఆయన పనితీరు ఎలా వుండేది అక్కడ ఆయనపై ఏమైనా ఆరోపణలు వచ్చాయా? అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
వాయిలార్ రవికి వ్యతిరేకంగా ఏమైనా సమాచారం దొరికితే ఆయనను టార్గెట్ చేస్తూ విమర్హ్షలు గుప్పించాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు తెలిసింది. నిన్నటి దాకా రాజకీయపెద్దగా, పిసిసి చీఫ్ కు గురువుగా వాయలార్ రవికి రాష్ట్రస్థాయి నేతల్లో ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎఐసిసి పరిశీలకునిగా, పార్టీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకునిగా ఆయన పాత్ర మారింది. దీంతో ఏమైనా సరే రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 80 శాతమైనా విజయం సాధించాలని ఆయన కృషి ప్రారంభిం చారు. దీనికి గాను ఆయన పార్టీ నేతలను సమన్వయ పరుచుకుంటూ వారి కార్యక్రమాలను శాసిస్తున్నారు.అలానే ఎక్కడ ఏ అభ్యర్థి ఎంత వరకూ ఓటర్లను ఆకర్షిస్తున్నారనే అంశంపై సమీక్షలూ చేస్తున్నారు. చివరకు నేరుగా తానే ప్రచారానికి తిరగాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇక ఎన్నికలయ్యేంత వరకూ రాష్ట్రంలోనే ఉండిపోతానని ప్రకటించారు. ముందుగా తన ప్రచారం ఆళ్ళగడ్డలో పూర్తి చేసుకున్నారు. తరువాత గుంటూరు జిల్లా మాచర్ల, పరకాలలో కూడా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నేరుగా తాను చూసిన వాతావరణాన్ని నమ్మిన రవి ఎక్కడికక్కడే మంచి పట్టున వారిని ఎంపిక చేసుకుని వారితో సంభాషిస్తారు. చాలా తక్కువగా మాట్లాడే ఈయన ఒక్కోసారి రెండున్నర గంటలు ఫోను కూడా మాట్లాదగారని ఈ ఉప ఎన్నికల్లో నిరూపించుకున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్లతో ఆయన సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్న వాయిలార్ రవి అనుకున్న లక్ష్యం సాదిస్తారా లేక ప్రత్యర్థి పార్టీ జల్లే బురదమరకలతో తిరిగి ఢిల్లీ వెళతారా అన్నది తేలాల్సి ఉంది.


.png)
.png)


