చర్చిలకు నిధులు పంపుతున్న జగన్ మోహన్ రెడ్ది

posted on: May 11, 2012 6:34AM

వచ్చే ఉప ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేసుకోవడానికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఉప ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాలు, ఒక లోక్ సభ నియోజకవర్గ పరిథిలోని మారుమూల గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న చర్చిలకు సైతం నిథులు పంపుతున్నట్లు తెలుగువన్.కామ్ పరిశోధనల్లో వెల్లడైంది. అయితే సిబీఐ నిఘాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఈ నిథులను నేరుగా కాకుండా తన బావగారైన అనిల్ కుమార్ ద్వారా పంపుతున్నట్లు తెలిసింది. ఈ నిథులు పంపటం ద్వారా చర్చిలకు అనుబంధంగా ఉన్న కూటముల్లోని దళిత క్రిష్టియనల ఓట్లు శాలిడ్ గా పొందేందుకు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో దళితులు పూర్తిగా జగన్ కు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయాన్నీ కొందరు క్రిస్టియన్ ఫాదర్ లు ధృవీకరిస్తున్నారు.

 

 

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక క్రిష్టియన్ ఫాదర్ తెలుగువన్.కామ్ తో మాట్లాడుతూ చర్చిలకు నిథులు రావటం సహజమేనని, ఎన్నికల సందర్భంగా అదనపు నిథులు వస్తున్నాయని ధృవీకరించారు.

 

 

అయితే ఈ నిథులకు రాజకీయాలకు సంబంధం లేదని ఆయన తెలిఅపారు. కానీ, ప్రార్థనా సమావేశాల్ల్లో జగన్ కు మద్దతు ఇవ్వాలంటూ క్రైస్తవసోదరులను కోరుతున్న మాట యథార్థమేనని ఆయన అంగీకరించటం విశేషం. ఇబ్బందుల్లో ఉన్న క్రైస్తవ సోదరులకు మద్దతు ఇవ్వటం తమ అర్తవ్యం అని కూడా అ ఫాదర్ తెలుగువన్.కామ్ తో చెప్పారు. చర్చికి అనుబంధంగా ఉన్న దళితక్రైస్తవుల సంఖ్యాబలాన్ని బట్టి ఇటీవల ఒక్కో చర్చికి 50 వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకూ నిథులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నిథుల సహకారంతో క్రైస్తవ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడే వారికి భోజనసదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. పనిలో పనిగా క్రైస్తవ బోధనలతో పాటు క్రైస్తవసోదరుడు జగన్ కు మద్దతు ఇవ్వాలని ఉద్బోదిస్తున్నారు. కొందరు ఫాదర్ లయితే మతవిశ్వాసుల నుంచి గట్టి వాగ్దానం కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...