రిఫైనరీ పేరుతొ 2500 ఎకరాలకు టెండరుపెట్టిన జి ఎమ్ ఆర్

posted on: Mar 31, 2012 7:11AM

రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల భూదాహం నానాటికి పెరిగిపోతోంది. చాలామంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటు పేరుతొ ఇప్పటికే వేలాది ఎకరాలు సేకరించారు. తాజాగా జి ఎమ్ ఆర్ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి మండలాల్లో రిఫైనరీ ఏర్పాటుచేస్తామంటూ ప్రభుత్వం నుంచి 2500 ఎక్లా భూమిని సేకరించింది. ఇక్కడ 25వేల కోట్ల రూపాయలతో రిఫైనరీ ఏర్పాటు చేయబోతున్నట్లు జి ఎమ్ ఆర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నిజానికి 25వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే రిఫైనరీకి 700 నుంచి 900 ఎకరాల భూమి సరిపోతుందని నిపుణులు అంటున్నారు కానీ జి ఎమ్ ఆర్ సంస్థ ఏకంగా 2500 ఎకరాల భూమికి టెండరు పెట్టింది. ఈ భూముల్లో అత్యధికం చిన్న చిన్న రైతుల నుంచి సేకరించిందే కావడం విశేషం.

భూములు కోల్పోయిన రైతులకు నామమాత్ర నష్టపరిహారం మాత్రమే ఇస్తున్నారు. అంతే తప్ప వీరు ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో వారికి పెద్దగా ఉపాధి అవకాశాలు కూడా లభించవు. పారిశ్రామికవేత్తలకు అవసరమున్నా లేకపోయినా ఇలా వేలాది ఎకరాల భూములను ఇవ్వడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాన్ పిక్ పేరుతొ లక్షలాది ఎకరాల భూములను నెల్లూరు, ఒంగోలు తీర ప్రాంతం మధ్య పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అప్పగించింది. అప్పనంగా భూములను పొందిన ఈ పారిశ్రామిక వేత్తలెవరూ ఇప్పటిదాకా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేడు. అయితే తమ పేరిట ఉన్న భూములను కబ్జా కాకుండా ఉండటానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఫెన్సింగ్, బౌండరీ వాల్స్ మాత్రం నిర్మిస్తున్నారు. పేదల భూములను తక్కువ ధరకే కాజేసిన వీరు ఆ భూములు తమ పేరిట బదిలీకాగానే అన్యాక్రాంతం కాకుండా చేర్యాలు తీసుకుంటున్నారు. అంతేకాని పరిశ్రమల ఏర్పాటుకు మాత్రం ముందుకు రావడం లేదు. జి ఎమ్ ఆర్ సంస్థకు 2500 ఎకరాల భూమిని కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నా నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన స్వచ్చంద సంస్థ ప్రజలకు సేవ చేస్తామంటూ ముందుకు వస్తోంది. అయితే ఈ సేవలపట్ల కూడా స్థానికులు ఆసక్తి చూపించడం లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...