Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
posted on: Feb 22, 2012 11:09AM
హైదరాబాద్: తెలంగాణలోని మహబూబ్ నగర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎస్పీఎస్ నెల్లూరులోని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభా స్థానాల ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 18వ తేదిన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల కోసం బుధవారం(ఈరోజు) నుండి దరఖాస్తులను స్వీకరిస్తారు. వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మార్చి 1వ తేదిన నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 3వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 18వ తేదిన పోలింగ్ నిర్వహిస్తారు. 21వ తేదిన కౌంటింగ్ ఉంటుంది. కాగా అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఏడు స్థానాలలో పోటీ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఐదుస్థానాల్లో బరిలోకి దిగుతోంది. సిపిఎం రెండు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. సిపిఐ ఉప ఎన్నికలకు దూరంగా ఉంది. బిజెపి పోటీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.


.jpeg)
.jpeg)


