Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బొత్స ఇలాఖాలో ఇళ్ళ నిర్మాణ నిధులు స్వాహా
posted on: Feb 21, 2012 10:58AM
విజయనగరంలో అధికార ముగుసులో కేతుగాళ్ళు
విజ
యనగరం: అధికారం అండ ఉంది. కీలక నేత అనుచరులమన్న ధైర్యముంది. ఇక మనకి అడ్దేం అనుకున్నారో ఏమో పేదల ఇళ్ళ నిర్మాణానికి విడుదలైన నిధులు స్వాహా చేశారు. ఎస్సీ లబ్దిదారులకు మంజూరైన ఇళ్ళ నిషులు బ్యాంకు నుంచి ధైర్యంగా డ్రాచేసిన దర్జాగా కైంకర్యం చేశారు. నిధులొస్తే మిగిలిన పని పూర్తిచేద్దామని కొందరు, నిర్మాణం పూర్తయినా ఇంకా డబ్బులు రావడం లేదే అని ఎదురు చూస్తున్న మరికొందరు ఈ తాజా కుంభకోణంతో అవాక్కయ్యారు. పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ఇలాకాలో తాజాగా వెలుగుచూసిన అవినీతి భాగోతం ఇది. ఇందిరమ్మ ఇళ్ళ పధకంపేర జిల్లాలో వేలాది ఇళ్ళను నిర్మిస్తున్నారు.బొత్స అనుచరులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు దళారులుగా మారి లబ్దిదారులకు తెలియకుండా వారి పేరిట వచ్చిన నిధులను వీరే స్వాహా చేస్తున్నారు. నిజానికి లబ్దిదారులకు నిధులు బ్యాంకునుంచి కోట్లాది రూపాయలు విత్ డ్రాచేసినట్లు తెలిసింది. ఇటీవల బొత్స అనుచరుడొకరు బ్యాంకు అధికారులకు కూడా మస్కాకొట్టి కోటి25లక్షల రూపాయలు అడ్డగోలుగా డ్రా చేయడంతో ఈ భాగోతం బైట పడింది.






