Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ కు పొంగులేటి వార్నింగ్
posted on: Feb 3, 2012 3:22PM
హైద
రాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులుపై కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలో ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాయో తెలియదన్నారు. కాంగ్రెసును విమర్శించే అర్హత వారికి లేదన్నారు. బివి రాఘవులు టివి రాఘవులుగా, నారాయణ కోడి నారాయణగా మారి పోయారని విమర్శించారు. మీడియాను ఆకర్షించేందుకే కమ్యూనిస్టు నేతలు కాంగ్రెసుపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ పార్టీలు కమర్షియల్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారి పోయాయని ఎద్దేవా చేశారు. అవి ఇప్పుడు దయానీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామికి తమ అధినేత్రి సోనియా గాంధీని విమర్శించే అర్హత లేదన్నారు. టిఆర్ఎస్ నేత కెసిఆర్ తెలంగాణ అంశం పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. ఆయన దౌర్భాగ్యం వల్లనే తెలంగాణ ఉద్యమం ఈ పరిస్థితికి వచ్చిందన్నారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.



.jpeg)


