Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐఏఎస్ ల టార్గెట్ పై గాలి మండిపాటు
posted on: Feb 3, 2012 2:18PM
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం కేసులో రాజకీయ నేతలను వదిలి కేవలం ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేయడం ఏమిటని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు శుక్రవారం ప్రశ్నించారు. ఎమ్మార్ కుంభకోణం కుట్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెవిపి రామచంద్ర రావు కుటుంబాలకు భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంలో రాజకీయ నేతలకు 75 శాతం, అధికారులకు 25 శాతం బాధ్యత ఉందన్నారు. కెవిపి ఇంటి నుంచే డబ్బుల పంపిణీ జరిగిందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని మంత్రివర్గానికి ఇందులో బాధ్యత ఉందన్నారు. అప్పటి మంత్రులు కొణిజేటి రోశయ్య, గీతా రెడ్డి, బొత్స సత్యనారాయణలపై సిబిఐ ఎందుకు ఛార్జీషీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఐఏఎస్‌లను అరెస్టు చేస్తున్న వారు అస్సాం ఓటర్ల లిస్టులో ప్రధానిని చేర్చినందుకే ఐఏఎస్ భానును వదిలేశారని ఆరోపించారు. తెరవెనుక పెద్దలను వదిలి కేవలం అధికారులనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.


.jpg)
.jpg)


