Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చినజీయర్ వ్యాఖ్యలపై స్పష్టం చేసిన సీఆర్సీ
posted on: Feb 3, 2012 2:06PM
వి
జయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానంపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై మతపెద్దలతో చర్చిస్తామని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శుక్రవారం స్పష్టం చేశారు. ఆయన బెజవాడ కనకదుర్గ అమ్మవారి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీయర్ వ్యాఖ్యలపై మత పెద్దలతో చర్చిస్తానని చెప్పారు. ఇక నుండి పండుగ తేదీలతో ఏడాది ముందుగానే క్యాలెండర్ రూపకల్పన చేస్తామని చెప్పారు. దేవాదాయ వివాదాల్లో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇందుకోసం ఓ కమిటీని వేయనున్నట్లు చెప్పారు. వివాదాస్పదమైన ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా సి.రామచంద్రయ్యతో పాటు స్వామి జయేంధ్ర సరస్వతీ వారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఇటీవల చినజీయర్ స్వామి టిటిడిపై మండిపడుతున్న విషయం తెలిసిందే.


.jpg)
.jpg)


