టీటీడీ పై చినజీయర్ ఘాటైన వ్యాఖ్యలు

posted on: Feb 3, 2012 2:02PM

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై చినజీయర్ స్వామి మండిపడ్డారు. వేయికాళ్ల మండపం కూల్చడం వల్లే రాష్ట్రానికి అరిష్టం దాపురించిందని చినజీయర్ స్వామి అన్నారు. వేయికాళ్ల మండపం కూల్చిన వారిని అరెస్ట్ చేయాలని చినజీయర్ స్వామి డిమాండ్ చేశారు. రాత్రి  పది గంటల తర్వాత తిరుమల వెంకన్న స్వామి ఆలయాన్ని తెరిచి వుంటే స్వామికి నిద్రాభంగం కలుగుతుందని, దీన్ని తితిదే ఏమాత్రం పట్టించుకోవడం లేదని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. విశ్వశాంతి కోసం భీష్మ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తిరుపతిలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చినజీయర్ స్వామి నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. కళ్యాణోత్సవాన్ని తితిదే బయట నిర్వహించడం తగదన్నారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని చినజీయర్ మండిపడ్డారు. తితిదే అహంకారాన్ని పక్కనబెట్టి తిరుమలను పవిత్ర క్షేత్రంగా ఉంచాలన్నారు. మొండి గోపురం ఆనవాళ్లు కూడా కనుమరుగయ్యాయని చినజీయర్ పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...