శశికళకు జయలలిత మరో దెబ్బ..దివాకరన్ అరెస్ట్

posted on: Feb 3, 2012 11:15AM

చెన్నై: పార్టీ నుంచి బహిష్కరించిన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో దెబ్బ తీశారు. శశికళ సోదరుడు దివాకరన్‌ను జయ శుక్రవారం అరెస్టు చేయించారు. రిషియూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటిని కూల్చిన కేసులో తిరువరూర్జిల్లాలో దివాకరన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు దివాకరన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.  దివాకరన్ అరెస్టు తర్వాత శశికళ బంధువు రావణన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దివాకరన్ తర్వాత రావణన్ అరెస్టు శశికళ బంధువుల్లో రెండోది. ఆయనను కోయంబత్తూరు జైలు నుండి పొళన్ జైలుకు తరలించారు. కాగా జయలలితను కాదని పార్టీలో శశికళ డామినేషన్ పెరగటంతోనే ఆమెను, మరో పదకొండు మందిని బహిష్కరించిన విషయం తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...