Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెసు పై రాజశేఖర్ దంపతుల పరోక్ష ఆరోపణలు
posted on: Feb 3, 2012 10:58AM
హైదరా
బాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో తన పార్టీ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి పార్టీలోకి రావడం వల్లనే తాము కాంగ్రెసు పార్టీకి దూరమయ్యామని ప్రముఖ హీరో రాజశేఖర్ దంపతులు గురువారం పరోక్షంగా చెప్పారు. హీరో రాజశేఖర్, దర్శకురాలు జీవిత మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా కాంగ్రెసు పార్టీ తమను బాగా ఉపయోగించుకుందని వారు ఆరోపించారు. అయితే ఎవరైతే కాంగ్రెసు పార్టీని తిట్టారో వాళ్లని కలుపుకున్న కారణంగానే తాము ఆ పార్టీ నుండి బయటకొచ్చామని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో డెబ్బై లక్షల ఓట్లున్న పార్టీని కలుపుకోవడం సహజమేనని వారు అన్నారు. ఆ విషయాన్ని తాము తప్పు పట్టడం లేదన్నారు. అయితే కాంగ్రెసుకు అంతగా ప్రచారం చేసిన తమను పిలిచి విలీనం తదితర విషయాలు రాజకీయాల్లో సహజమేనని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా వారు కాంగ్రెసుకు దూరమై ఆ తర్వాత కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయనతో విభేదించి ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చారు.


.jpg)



