Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫిబ్రవరి 15వరకూ రిమాండ్ లో బీపీ ఆచార్య
posted on: Feb 2, 2012 10:47AM
హై
దరాబాద్ : ఎమ్మార్ కేసులో అరెస్ట్ చేసిన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను గురువారం సీబీఐ అధికారులు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు ఫిబ్రవరి 15 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బీపీ ఆచార్యను చంచలగూడ జైలుకు తరలించారు.
కాగా అంతకు ముందు బీపీ ఆచార్య తన ఆరోగ్యం గురించి న్యాయమూర్తికి విన్నవించారు. ఆరోగ్యం బాగోలేకున్నా బలవంతంగా నిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని ఆయన తెలిపారు. మీ ఆరోగ్యం గురించి జైలు అధికారులు చూసుకుంటారని న్యాయమూర్తి నాగమారుతి శర్మ ఈ సందర్భంగా బీపీ ఆచార్యతో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం ఆచార్యను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.


.jpg)
.jpg)


