యువతకు బాబు పిలుపు

posted on: Feb 2, 2012 10:04AM

హైదరాబాద్: ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 20 యేళ్లు వెనక్కి పోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందువల్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని మళ్లీ ముందడుగు వేయించి అగ్రగామిగా నిలబెట్టడానికి తమకు మద్దతు ఇవ్వాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ కొందరు అవినీతి అసమర్థ నేతల వల్ల యువతరం రాజకీయాలంటే విసుగు, విరక్తి పెంచుకొంటోంది. ఒక మంచి ఉద్యోగం దొరికితే లైఫ్‌లో సెటిలై పోవచ్చునని భావం ఏర్పడి ఉందన్నారు. అయితే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించగలరన్నారు. ప్రస్తుతం తమ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తోందని, దీనిలో పెద్ద ఎత్తున పాల్గొనేలా యువతను ప్రోత్సహించే నిమిత్తం ప్రాంతీయ యువజన సదస్సులు నిర్వహిస్తున్నట్లు బాబు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...