సీబీఐ అదుపులో కోనేరు ప్రసాద్‌ కుమారుడు మధు

posted on: Jan 28, 2012 8:02AM

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసుకు సంబంధించి కోనేరు ప్రసాద్‌ కుమారుడు మధును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో ఉంటున్న కోనేరు మధును సిబిఐ అధికారులు దుబాయ్ నుండి రప్పించి విచారిస్తున్నారు. ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోనేరు ప్రసాద్‌కు ఇద్దరు కొడుకులు. మధు దుబాయ్‌లో ఉంటున్నారు. దీంతో సిబిఐ ప్రధానంగా ఈయన పైనే దృష్టి సారించింది. ఎమ్మార్ కేసులో దుబాయ్‌లో ఉంటున్న మధు అకౌంట్ ద్వారా విదేశాల్లోకి నిధులు మళ్లించారని సిబిఐ అనుమానిస్తోంది.  ట్రైమ్యాక్స్‌ ఎండీని సీబీఐ అరెస్టు చేసింది. కేసుకు సంబంధించి వివిధ అంశాలపై వారిద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...