బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయం:చంద్రబాబు నాయుడు

posted on: Jan 27, 2012 7:25PM

హైదరాబాద్:ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన బీసీ సాధికారిక సదస్సులో  బిసిలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో కొన్ని సీట్లు బిసీలకు ఇవ్వడం వల్ల నష్టపోయామని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయినా బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసిలకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రస్తుతం వారికున్న రిజర్వేషన్ కోటా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు టీడీపీ పోరాడుతుందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో బీసీ సమస్యను ఎజెండాగా మార్చుతామని, కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఒత్తిడి తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల కోసం పోరాడినట్లుగానే బిసీల కోసం కూడా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. బిసీలకు, ముస్లిం మైనారిటీలకు మధ్య కాంగ్రెసు చిచ్చు పెడుతోందని బిసీలను కాంగ్రెసు ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిసీలకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...