|
|
15రోజుల్లో పదవికి గుడ్ బై జగన్ ఎమ్మెల్యే కాపు
హైదరాబా
ద్: కొన్ని రాజకీయ కారణాల వల్ల మరో 15..20 రోజుల్లోపు ఎమ్మెల్యే పదవి నుండి స్వచ్ఛందంగా వైదొలగనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి గురువారం ప్రకటించారు. గురువారం రాయదుర్గం పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. తనకు శాసనసభ్యుడి హోదాలో బహుశా ఇదే చివరి కార్యక్రమం కావచ్చునన్నారు. అతి తక్కువ సమయం ఉన్న వ్యక్తి తానే అని, అయినా ప్రజలకు చేతనైన సహాయం చేశానని చెప్పారు. విజయవంతమైన ఎమ్మెల్యే కాకపోయాననే బాధ ఉందన్నారు. ప్రజలకు సేవలు చేసేవాడిగా ఉంటానని అన్నారు. దేశంలో ఉన్న కుళ్లంతా రాజకీయ నాయకుల్లోనే ఉండిపోయిందన్నారు. నన్ను మీవాడిగా ఆదరిస్తారని భావిస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో అతి తక్కువ కాలం ఎమ్మెల్యే హోదాలో కొనసాగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతానన్నారు. తన ఆస్తి వివరాలు ఎవరైనా సమాచార హక్కు, చట్టం ద్వారా పొందవచ్చునని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అభివృద్ధి పనులు చేపట్టలేక పోవడంపై బాధ కలుగుతోందన్నారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే.
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
- AP Bypolls: Congress Announces 3 Candida...
- Jagan Assets Case: CBI to Examine YSR, J...
- Shiv Sena-BJP Combine Captures Brihanmum...
- AP Budget-2012-13: Babu Terms it Anti-pe...
- Jagan MLA Pilli Subhash Chandra Bose Res...
- HC Rejects Vijayamma's Petition Against...
- Sympathy Wave in Kadapa on The Wane: Viv...
- Rs. 1 Crore Seized From President Pratib...


