Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ రెండు చానల్స్ బహిష్కరణకు కు చంద్ర బాబు నిర్ణయం
posted on: Jan 27, 2012 8:24AM
హైదరాబాద్
: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికను, టీవీ చానెల్‌ను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా వెలువడుతుందని నమస్తే తెలంగాణ పత్రికపై, టీ చానెల్‌పై కూడా ఆ పార్టీ అదే నిర్ణయం తీసుకుంది.పార్టీ అధినేత చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు తదితరులు సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఆ రెండు చానెళ్లు, పత్రికల్లో తమ పార్టీపై, పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురిస్తున్నారని పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ చానెళ్లు, పత్రికల తీరుపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వాటి తీరులో ఎటువంటి మార్పు లేదన్న అభిప్రాయంతో చంద్రబాబు ఏకీభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఆ పత్రికలు, చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో బహిష్కరణ నిర్ణయాన్ని టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది.


.jpg)



