వారిద్దరే మంచి మిత్రులు : మురళీమోహన్‌

posted on: Jan 26, 2012 3:06PM

హైదరాబాద్‌ : చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ మంచి మిత్రులని, అనవసరంగా వారిద్దరి మధ్య విభేదాలు సృష్టించవద్దని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్‌ మీడియాకు విజ్ఞప్తి చేశారు.శంషాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హీరోల అభిమానులు కూడా సినిమాలతో రాజకీయాలను ముడిపెట్టి అనవసరంగా గొడవలకు దిగవద్దని కోరారు. మరోవైపు అభిమానులు కూడా రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టి అనవసరంగా ఘర్షణలకు దిగరాదని సూచించారు.  చిరు, బాలయ్య ఒకరిపై ఒకరు ప్రత్యేక ఎన్నికల్లో పోటీపడే అవకాశమే లేదని చెప్పారు.

కాగా గత కొన్ని రోజులుగా బాలకృష్ణ, చిరంజీవిల మధ్య వాగ్యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. వీరి వాగ్యుద్ధం నేపథ్యంలో బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్పీఎస్ నెల్లూరులో పోటా పోటీగా దిష్టిబొమ్మల దగ్ధానికి ప్రయత్నాలు జరగ్గా, తిరుపతిలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...