Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయవంతమైన బొత్స నల్గొండ టూర్ !
posted on: Jan 26, 2012 1:39PM
హైదరా
బాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిర్వహించిన ఒక్కరోజు నల్గొండ జిల్లా పర్యటనకు ఎక్కడా కూడా తెలంగాణ షాకు తగలకుండా విజయవంతమైంది.దీంతో బొత్సతో పాటు కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొత్స సత్యనారాయణ తొలిసారి తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ జిల్లా పర్యటన చేపట్టారు. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడలో పర్యటించిన ఆయన మిర్యాలగూడలో దివంగత ఎమ్మెల్యే రాగ్యానాయక్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్, చంద్రబాబులపై విరుచుకుపడ్డారు. కాల్చేయండని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్న బొత్స తాను ఏ తప్పూ చేయనప్పుడు భయపడటం దేనికని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను తొలగించేందుకు సీఎంతో మాట్లాడతానని బొత్స హామీ ఇచ్చారు. ఇలా అన్ని అంశాలపై స్పందించిన బొత్స పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను ఆకట్టుకుని తన తెలంగాణ తొలి పర్యటనను విజయవంతం చేసుకున్నారు.


.jpeg)
.jpeg)


