Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మమత...మరువలేని జ్ఞాపకాలు
posted on: Jan 26, 2012 8:30AM
కో
ల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన స్వీయ రచన మరువలేని జ్ఞాపకాలు అనే పుస్తకంలో ఎన్నో విషయాలను వెల్లడించారు. రికార్డుల్లో తన వయస్సు 57 ఏళ్లుగా ఉందని, నిజానికి తన వయస్సు 52 మాత్రమేనని మమతా బెనర్జీ పేర్కొన్నారు. స్కూల్ ఫైనల్ ఎగ్జామినేషన్ రాయడానికి గాను ఆమె వయసును తండ్రి ఐదేళ్లు ఎక్కువ రాయించారు. ఇందుకోసం తప్పుడు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం సృష్టించారు. ఈ వాస్తవాన్ని మమతా బెనర్జీయే స్వయంగా వెల్లడించారు. పుట్టిన తేదీ మార్పు వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు తాను ఎప్పుడూ పుట్టిన రోజు జరుపుకోలేదని ఆమె చెప్పారు. మమతా బెనర్జీ అక్టోబర్ 5న జన్మించారు. కాని సర్టిఫికెట్లలో ఆమె పుట్టిన తేది జనవరి 5గా ఉంది. ముఖ్యమంత్రి కావడానికి ముందు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న మమతా బెనర్జీ పుట్టిన తేదీని లోక్‌సభ వెబ్‌సైట్‌లో కూడా జనవరి 5, 1955గా పేర్కొన్నారు. ‘నా మరచిపోలేని జ్ఞాపకాలు’ అనే పుస్తకంలో ఆమె ఈ విషయాలు తెలిపారు. ఈ పుస్తకంలో ఆమె ఇంకా ఎన్నో విషయాలను వెల్లడించారు.






