కుటుంబం వేరు,పార్టీ వేరు: జూ.ఎన్టీఆర్‌పై చంద్రబాబు

posted on: Jan 25, 2012 3:43PM

విజయవాడ: తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరంగా ఉంచడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కృష్ణా జిల్లా పోరుబాటలో భాగంగా పాదయాత్ర చేసిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌పై మాట్లాడుతూ  పార్టీకి కట్టుబడి పని చేయకపోతే ఎవరినా పక్కన పెడతామని ఆయన అన్నారు. పార్టీకి ఎవరూ అతీతులు కారని ఆయన అన్నారు. కుటుంబ వేరు, పార్టీ వేరని ఆయన అన్నారు. పార్టీకి సేవ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వారి సేవలను ఎలా వియోగించుకోవాలో పార్టీ అధ్యక్షుడిగా తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఏర్పడిందని, తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని, అందువల్ల ఎవరు పనిచేసినా అందుకు అనుగుణంగానే ఉండాలని ఆయన అన్నారు. ఓ ప్రముఖ టీవీ చానెల్‌ ప్రతినిధికి ఇంటర్వూ ఇస్తూ ఆయన జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంపై వివరణ ఇచ్చారు.

2014లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ఆయన అన్నారు. పార్టీకి సేవ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా తాము ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. బాలకృష్ణ సహా అందరూ పార్టీ నిర్ణయాలకు, నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొల్లేరు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు తాము అధికారంలోకి వస్తే చేపల చెరువులకు సంబంధించి 7500 ఎకరాలను పేదలకు పంచుతామని ఆయన చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు సరిగా లేకున్నా రెండో పంటకు నీరు విడుదల చేశామని ఆయన చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...