Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫిబ్రవరి 1 వరకు రిమాండ్ లో సునీల్ రెడ్డి
posted on: Jan 25, 2012 1:40PM
హైదరా
బాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టైన సునీల్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 1వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సిబిఐ కూడా సునీల్ రెడ్డిని తమ కస్టడీలోకి పదిహేను రోజులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. కాగా మంగళవారం సాయంత్రం తాము సునీల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు రోజులుగా సునీల్ రెడ్డిని సిబిఐ అధికారులు రహస్యంగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్, కోనేరు రంగా రావు, సునీల్ రెడ్డిలదే కీలక పాత్ర అని సిబిఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. విల్లాల యజమానుల నుండి డబ్బులు వసూలు చేసింది రంగారావు, సునీల్ రెడ్డిలే అని పేర్కొంది. విల్లాల డబ్బు తరలింపు మర్మం సునీల్ రెడ్డికే తెలుసునని చెప్పింది.
కాగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సునీల్ రెడ్డిని దిల్ కుషా అతిథిగృహం నుండి బేగంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అంతకు ముందు సునీల్ రెడ్డిని భార్య కృష్ణ తేజ కలిశారు.



.jpeg)


