Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సంస్కరణలు భవిష్యత్ ను మారుస్తాయి.. చంద్రబాబు
posted on: Oct 17, 2025 2:43PM

భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించి వారితో కొద్ది సేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా? అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం, 5 శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయనీ, దీని వల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు.
నాటిన కొంత కాలానికి చెట్టు ఫలాలు ఇచ్చినట్లు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని చంద్రబాబు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై వ్యాసరచన. పెయింటింగ్, వక్తృత్వ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి నందుకు ఆయన వారినిఅభినందించారు.



.webp)


