Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పక్షులు ఢీ కొనడం వల్లే విమానం కుప్పకూలిందా?
posted on: Jun 13, 2025 8:50AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 8200 గంటల విమాన ప్రయాణం అనుభవం ఉన్న పైలట్ సుమిత్ సభర్వాల్, అలాగే కోపైలట్ కో పైలట్ క్లైవ్ కుందర్ మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో 298 మంది చనిపోయారు. మరణించిన వారిలో 241 మంది విమాన ప్రయాణీకులు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన మిగిలిన వారంతా బీజే మెడికల్ కాలేజీ విద్యార్థలు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ ను ఢీ కొనడంతో వారు మరణించారు.
లంచ్ టైమ్ లో ఈ దారుణం సంభవించింది. భోజనాలు చేస్తున్న విద్యార్థులు అలాగే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా కూడా వైద్య విద్యార్థులే. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రాధమికంగా అయితే పక్షులు ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.


.webp)
.webp)


