TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిగ్భ్రాంతి

Published on: Wed Jun 4, 2025 7:19PM

 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు డీకే క్షమాపణలు చెప్పారు. ఆర్సీబీ ఫ్యాన్స్ బారీగా తరలిరావడంతో అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు.మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిలందరికీ సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

భద్రత కోసం 5,000 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. అయితే, అక్కడ ఉన్నది ఉత్సాహంతో ఉన్న యువత. వారిపై లాఠీఛార్జ్ చేయలేము కదా" అని డీకే శివకుమార్ అన్నారు.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తొక్కిసలాటలో 11 మంది వరకు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.సడన్‌గా 19వ గేటు ఓపెన్ చేయటంతో  తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు విక్టరీ పరేడ్ కోసం లక్షలాది మంది వచ్చారని అందుకని 10 నిమిషాల్లో సన్మాన కార్యక్రమం ముగించామని- డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.