TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..11 మంది మృతి

Published on: Wed Jun 4, 2025 6:21PM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల  తర్వాత ఛాంపియన్స్ నిలవటంతో   ఫ్యాన్స్  భారీగా  స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11  మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచే చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురుచూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. 

క్షతగాత్రులను శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆర్సీబీ టీమ్‌కు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.క్షతగాత్రులను స్థానిక బోరింగ్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరామర్శించేందుకు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య విధాన సౌధ నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయలేకపోయామని వారు తెలిపారు.