Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ ఏటీఎంలుగా ఆర్‌బిసీలు.. అచ్చెన్నాయుడు
posted on: Aug 17, 2022 12:56PM
రాజకీయ మనుగడ కోసం రైతాంగాన్ని ద్రోహం చేయడానికి వెనుకాడటం లేదన్నది వైసీపీ ప్రభుత్వం పై విపక్షాల మాట. తాజాగా రైతు బరోసా కేంద్రాలను కేవలం ఏటీఎం మిషన్లుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆర్బీకేలు రైతుల నుంచి సరిగా ధాన్యం కొనడం లేదని, కొన్నప్పటికీ రైతుకి వెంటనే వాటి డబ్బు చెల్లించడం లేదని ఆయన మండిపడ్డారు. ఎరువులు అధిక ధరలకు అమ్ముతూ రైతులకు ఎరువులపై స్వల్పకాలిక రుణం కూడా దక్కడం లేదని, రాష్ట్రంలో నిత్యం ఎరువుల కొరత ఉండటం రైతాంగం పట్ల ప్రభుత్వ ప్రేమనే తెలియజేస్తుందన్నారు.
రాష్ట్రంలో అధికారులు, వైసీపీ నాయకుల మధ్య రైతాంగం నలిగిపోతున్నారని అచ్చెన్నాయుడు ఆరో పించారు. వారు కుమ్మక్కయి నకిలీ రైతులను నమోదు చేసి ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే వందల కోట్ల సొమ్ము కాజేశారని ఆరోపించారు. మొత్తం కొనుగోళ్లపై లెక్కలు పరిశీలిస్తే ప్రభుత్వం రైతాంగానికి ఎంతగా మోసం చేసింది, చేస్తున్నదీ బయటపడుతుందని అన్నారు. ధరల స్థిరీకరణకు రూ.3000 కోట్లు, విపత్తు లకు రూ.6000 కోట్లు కేటాయిస్తామని చెప్పారని వేటికీ దిక్కు లేదని ఆయన అన్నారు.
ఈ పరిపాలనను మించిన విపత్తు మరొకటి లేదని విమర్శించారు. ధాన్యం బస్తాపై 200 వరకూ కమీషన్ గుంజుతున్నారని తెలిపారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువుల మొత్తం ఎంత? ఎంత మొత్తంలో ఎరువులు ఆర్బీకే ల వద్ద ఉన్నది, ఎంత మొత్తం ఆర్బీకే ల ద్వారా ఇచ్చారన్నదీ ప్రభుత్వం తెలియజేయాలని టీడీపీ సీనీయర్ నేత డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పంట పండించారు, అందులో ఆర్బీకే ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? దానిలో రైతులకు పెట్టిన బకాయిలు ఎంత? అనే విషయాలపై ఈ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.






