20 ఎంపీ సీట్లు గెలిపిస్తాం: రాయపాటి

 

 

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వెనుకడుగు వేయకపోయినా, కాంగ్రెస్‌ ఎంపిలు మాత్రం ఇంకా అధిష్టానం నిర్ణయం వెనక్కు తీసుకుంటుందన్న ఆశతోనే ఉన్నారు. 60 రోజులుగా సీమాంద్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపధ్యంలో గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు మరోసారి అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.



అదే సమయంలో ఆయన రాజీనామా ఆలోచనలో ఉన్న బొత్సా వైఖరి పై కూడా స్పందిచారు. అందరిని రాజీనామా చేయోద్దని వారించిన బొత్సా ఇప్పుడు తాను ఎందుకు రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారో అర్ధం కావటం లేదు అన్నారు. సీనియర్లను కాదని పార్టీ కూడా మొండిగా నిర్ణయాలు తీసుకోవటం తగదన్నారు.



రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే 20 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురావడం కష్టమేనని, తెలంగాణ ఇచ్చిన పేరుతో ఆంద్రాలో కూడా పార్టీ నష్టపోతుందని అన్నారు. కేవలం పైరవీలతొనే సీయం పోస్టు వచ్చిందనడం పొరబాటన్నారు.