రాయలసీమలో ఉద్రిక్తత.. హింసాత్మకంగా మారిన బంద్..
posted on May 24, 2017 10:18AM

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వామపక్షాలకు కాంగ్రెస్ కూడా మద్దతివ్వడంతో నిరసకారులు రోడ్లపైకి వచ్చి బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టి తమ ప్రతాపం చూపారు. మరోవైపు తిరుపతిలో బస్టాండు ముందు పలు పార్టీల కార్యకర్తలు నిరసనలకు దిగి డిపో నుంచి ఒక్క బస్సును కూడా బయటకు రానీయకపోవడంతో తిరుమలకు వెళ్లాలని వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మదనపల్లి, పీలేరు, కదిరి, గుత్తి, డోన్ తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చిన హింసాత్మక ఘటనలకు దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.