రవివర్మ చిత్రాలకు ప్రేరణ ఆమె

అంజనీబాయి మాల్పెకర్ (22 ఏప్రిల్ 1883 - 7 ఆగస్టు 1974)

రవివర్మ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మరి ఆయన చిత్రాల్లో కనిపించి ముగ్ధమనోహర సౌందర్యవతి నిజంగానే ఈ భూమి మీద ఉందా లేదా ఊహసుందరినా అన్న అనుమానం చాలామందికి వస్తుంది. అయితే అంజనీ బాయి మాల్పెకర్ ను చూసిన వారు ఆమె రవివర్మ చిత్రాలకు నమూన అని అంటారు.

 

సంగీత కళాకారిణిగానే ఎక్కువ మందికి తెలిసిన ఆమె రవివర్మ  కుంచెతో ప్రాణం పోసుకున్న  లేడీ ఇన్ ది మూన్లైట్", "లేడీ ప్లేయింగ్ స్వర్బాట్", "మోహిని" ,"ది హార్ట్‌బ్రోకెన్" తదితర చిత్రాలకు ప్రేరణ అని అతి తక్కువ మందికి తెలుసు. 

పండిత్ అంజనీ బాయి మాల్పెకర్ ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. హిందూస్థానీ సంగీతంలో భెండిబజార్ గరానా శైలిలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత విధ్యాంసుడు  ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలు. గోవాలోని మాల్పేలో 22 ఏప్రిల్ 1883లో కొంకణి భాష మాట్లాడే గోవా సంగీత కారుల  కుటుంబంలో  అంజనీ జన్మించారు. ఆమె తాత గుజాబాయి,  తల్లి నబుబాయిలు  సంగీత  ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినవారు. తన 8వ ఏట ఉస్తాద్ నజీర్ ఖాన్ వద్ద భెండి బజార్ గరానా శైలిలో సంగీత శిక్షణ తీసుకున్నారు. గురువుతో పాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్న మొదటి మహిళగా ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఎనిమిదేండ్ల పాటు కఠోన సంగీత సాధన చేసిన ఆమె 1899లో తన 16వ ఏట ముంబైలో మొదటిసారి కచేరి చేశారు. అప్పటికి మహిళలు ప్రదర్శనలు ఇచ్చేవారు కాదు. కానీ అంజనీ మాత్రం  తన కచేరీల ద్వారా ఎంతో గౌరవం సాధించుకుంది.  

 

1920 వరకు ఆమె సంగీత కెరీర్ చాలా బాగా సాగింది. అయితే ఆమె గురువు చనిపోవడంతో  ప్రజా ప్రదర్శనలకు దూరమైంది. అందమైన ఆమె రూపం కూడా ప్రదర్శనలకు దూరం కావడానికి ఒక కారణం. కచేరిలో  కొందరు ప్రేక్షకుల నుంచి వచ్చే వేధింపులు ఆమెను బాధించేవి.  దాంతో ఆమె కచేరిలు ఆపేసి 1923 నుంచి పూర్తిగా సంగీత శిక్షణకే సమయం కేటాయించేవారు. ఆమె వద్ద సంగీతం నేర్చుకున్న కుమార్ గాంధర్వ, కిషోర్ అమోంకర్ ప్రసిద్ధ సంగీత కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. 

అద్భుతమైన గాత్రంతో పాటు అపూర్వమైన అందం ఆమె సొంతం. ప్రముఖ చిత్రకారుడు ఎం.వి. ధురంధర్ ఆమె చిత్రాన్ని గీసినప్పుడు రవివర్మ చూసి అబ్బురపడ్డారట. తమ చిత్రాలు ఆమెను ప్రేరణగా తీసుకున్నారు. "లేడీ ఇన్ ది మూన్లైట్", "లేడీ ప్లేయింగ్ స్వర్బాట్", "మోహిని",  "ది హార్ట్‌బ్రోకెన్" తదితర చిత్రాలకు అంజనీ ప్రేరణగా నిలిచారు.