భిక్షాటన చేసిన ఎంపీ..

 

రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని పలువురు విమర్సలు చేస్తున్నారు.  దీనికి తోడు ఇప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా తోడైనాయి. రైతల ఆత్మహత్యలు చేసుకోవడమేమోకాని వారివల్ల ప్రతిపక్షాలకు మాత్రం అధికార పార్టీమీద విమర్శలు చేయడానికి మంచి పాయింట్ దొరికింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదోలా తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సైలెంట్ గా ఉంటే వర్కవుట్ కాదకున్నారేమే కాని ఈమధ్య బాగానే మీడియా సమావేశాలు గట్రా పెట్టి.. ఏదో కారణంతో ప్రతిపక్ష నేతలను నాలుగు తిట్లు తిడుతూ ఫోకస్ అవుతున్నారు.  అలాంటిది ఇప్పుడు రైతుల ఆత్మహత్యలను అంత తేలికగా వదిలిపెడతారా.. మంచి పాయింట్ దొరికింది కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్లు అధికార ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందరూ ఒకేలా చేస్తే ఏం బావుంటుంది అని అనుకున్నారేమో ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. రాజకీయాల్లో తన విలక్షణ పోకడను కనబరిచారు.

తెలంగాణ లోని భూదాన్ పోచంపల్లిలో ఒక చేనేత కార్మికుడు పగడాల నగేష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆనందభాస్కర్ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన ఆర్థిక సాయం చేయడానికి ఎంపీ రాపోలు ఆ గ్రామంలో భిక్షమెత్తారు. అలా భిక్షాటన చేయగా వచ్చిన రూ. 50వేల రూపాయలను నగేష్ కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన చెప్పారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలు రైతు ఆత్మహత్యల వల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ల పోకడను చూపిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu