సానియా ర్యాంకు కు ఎసరు పెట్టిన నిధి చిలుముల
Publish Date:Apr 2, 2013
డబ్యు.టి.ఎ. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో చిలుముల నిధి సానియా మీర్జా కంటే మెరుగైన ర్యాంకింగ్ పొందింది. గత ర్యాంకింగ్ లో 681స్థానంలో వున్న నిధి ప్రస్తుత తాజా ర్యాంకింగ్ లో 616 స్థానానికి చేరుకుంది 65 స్థానాలు మెరుగుపరచుకుంది. సానియా మీర్జాకు 702 ర్యాంక్ దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యుత్తమ ర్యాంకర్ గా నిలిచింది. 476వ ర్యాంకర్ రిషిక సుంకర మన రాష్ట్ర అమ్మాయే అయినా ప్రస్తుతం ఆమె ఢిల్లీలో స్థిరపడింది. రాష్ట్రంలో నిధి కంటే మెరుగైన ర్యాంక్ మరెవరికీ లేకపోవడం గమనార్హం.