ఆరోజు రామోజీ అరెస్ట్ కాకుండా కాపాడిందెవరు? ఎక్స్ క్లూజివ్ స్టోరీ

రామోజీరావును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలని ఆనాడు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుకున్నారని టీడీపీ నేత  చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిప్పు లేకుండా పొగ పుట్టదన్న రీతిగా రామోజీ అరెస్ట్ కు వైఎస్ హయాంలో తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్నది నిజమే అంటున్నారు, చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి రాజగురువైన రామోజీ ఈ విషయం చెప్పే ఉంటారని, తెలుగుదేశం పార్టీకి కచ్చితమైన సమాచారం ఉన్నందునే సోమిరెడ్డి ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారని చెబుతున్నారు.

ఈనాడు, రామోజీ అంటే వైఎస్ కు విపరీతమైన ద్వేషం, ఎల్లో పత్రికలు, ఎల్లో ఛానల్స్ అంటూ ఎప్పుడూ విరుచుకుపడేవారు, ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే అనుకూలంగా పనిచేస్తాయని, ప్రజాప్రయోజనాలు పట్టవని, ఎప్పుడూ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనే తప్ప, మిగతా ప్రభుత్వాలు మంచి చేసినా రామోజీకి పట్టదని వైఎస్ ఆరోపించేవారు, తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈనాడుపైనా రామోజీపైనా యుద్ధం ప్రకటించి విరుచుకుపడేవారు, అందుకే ఈనాడులో జగన్ గురించి తీవ్రమైన ఆర్టికల్స్ రాస్తే, జగన్ తన పత్రిక సాక్షిలో రామోజీని తిడుతూ కథనాలు వచ్చేవి.

అయితే అందరి తప్పులూ ఎత్తిచూపే రామోజీ కూడా మార్గదర్శి విషయంలో వైఎస్ కు దొరికిపోయారు, రామోజీ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న సమమంలో మార్గదర్శి ఇష్యూ వైఎస్ కి ఆయుధంలా దొరికింది, దాంతో రామోజీని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టారు, ఒకానొక టైమ్ లో రామోజీ ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెబుతారు. మార్గదర్శి వివాదం నుంచి బయటపడటానికి రామోజీ పడ్డ తిప్పలు అన్నీఇన్నీ కావంటారు, తెలుగు మినహా ఈటీవీ గ్రూప్ ఛానల్స్ ను అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, దాదాపు ఆర్ధికంగా దివాళా తీసే పరిస్థితికి ఆనాడు వైఎస్ తీసుకొచ్చారని, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ అకాల మరణం చెందడంతో గండం గట్టెక్కారని లేదంటే రామోజీ పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పుకుంటారు.

అయితే మార్గదర్శి ఇష్యూ పీక్ స్టేజ్ లో ఉంఢగా, ఆ కేసును అడ్డం పెట్టుకుని రామోజీ అరెస్ట్ కు వైఎస్ ప్లాన్ చేశారట, అత్యంత కాన్ఫిడెన్షియల్ గా జరిగిన ఈ వ్యవహారం వైఎస్, కేవీపీ, జగన్ తోపాటు వైఎస్ కి అత్యంత సన్నిహితులకి తప్పు ఇంకెవరికీ తెలియదంటారు, రామోజీ అరెస్ట్ కు రంగంసిద్ధంచేసి పోలీస్ బాస్ కి ఆదేశాలు కూడా ఇచ్చేశారని, అయితే తెల్లవారితే అరెస్ట్ జరుగుతుందనగా అరెస్ట్ ఆగిపోయిందని అత్యంత విశ్వసనీయ సమాచారం.

ఓ రోజు అర్థరాత్రి రామోజీ పర్సనల్ ఫోన్ మోగింది, ఇంట్లో వాళ్లు, అత్యంత సన్నిహితులు సైతం ఫోన్ చేసే టైమ్ కాదది, ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఆ టైమ్ లో ఫోన్ ఇవ్వడానికి సాహసం చేయరట, అయినా ఎంతోమందిని ఒప్పించి అతికష్టంమీద ఓ వ్యక్తి ఆ ఫోన్ చేశాడు, ఆ ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకున్న రామోజీ...తెల్లవారితే తనను అరెస్ట్ చేస్తారనే విషయాన్ని తెలుసుకున్నారట, అయితే ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని మొదట రామోజీ నమ్మకపోయినా తనకున్న పలుకుబడి, పొలిటికల్ అండ్ మీడియా నెట్ వర్క్ తో నిజమని నిర్ధారించుకుని, ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అరెస్ట్ ను ఆపించుకున్నారట, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నుంచే ఆరోజు వైఎస్ కి ఫోన్ వచ్చిందని, అందువల్లే అరెస్ట్ నిలిచిపోయిందని అంటారు. అలా ఆరోజు రామోజీ అరెస్ట్ కాకుండా ఆగిపోయిందట, అత్యంత కాన్ఫిడెన్షియల్ గా జరిగిన ఈ వ్యవహారం... సోమిరెడ్డి ఆరోపణలతో నిజమేనని చెప్పొచ్చు, ఎందుకంటే నిప్పులేకుండా పొగ రాదుకదా

Online Jyotish
Tone Academy
KidsOne Telugu