రామోజీ, జగన్... ఇద్దరిలో ఎవరు మెట్టుదిగారు?
posted on Sep 24, 2015 11:37PM

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిలో రామోజీరావు, జగన్ మాట్లాడుకుంటున్న విజువల్స్ ను చూసి రాజకీయ నేతలతోపాటు జనాలు కూడా ఆశ్చర్యపోయారు, మనోజ్ పెళ్లిలో జగన్ రాకను గమనించి రామోజీరావే ముందుగా జగన్ ను విష్ చేయగా, జగన్ కూడా రామోజీకి ప్రతి నమస్కారం చేశారు. ఈ అరుదైన ఈ దృశ్యాన్ని చూసి కలా నిజమా అన్నరీతిలో అందరూ అవాక్కయ్యారు. ఆరోజు మంచు మనోజ్ పెళ్లి కంటే రామోజీ-జగన్ కలయికే పెద్ద హైలెట్ అయ్యింది, ఇవాళ మరోసారి జగన్...రామోజీతో భేటీకావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రామోజీ అంటే పడని జగన్....ఎందుకు ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ కలిశాడనే చర్చ మొదలైంది, రామోజీరావే పెద్దరికాన్ని చూపించాడా? లేక జగన్ మెట్టుదిగాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియదు గానీ...వీరిద్దరి భేటీ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.