చంద్రబాబుతో బాబా రాందేవ్‌ భేటీ

 

అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే ‘మెగా ఫుడ్ పార్క్’ గురించి ముఖ్యమంత్రికి రాందేవ్ వివరించారు. రూ.634 కోట్ల వ్యయంతో ఆహారశుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎంకు తెలిపారు. ఈ పార్క్‌తో 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగాఫుడ్‌ పార్క్‌కు 172.84 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయనాలు, పురుగు మందులు లేని వ్యవసాయ ఉత్పత్తుల దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. బాబా రాందేవ్ కు చెందిన ప‌తంజ‌లి సంస్థ స్వదేశీ ఉత్పత్తుల నినాదంతో కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో నమ్మకమైన బ్రాండ్‌గా పేరుగాంచి మరింతగా విస్తరిస్తోంది.