పొలిటికల్‌ ఇఫ్తార్‌లు బంద్‌

 

 Ramadan Iftar, Political Iftar Parties, Muslim India Political Iftars, Political Party and Muslim Leaders Iftar

 

 

రాష్ట్రంలో రంజాన్‌ సందడి మొదలైంది.. అయితే ఈ సమయాన్ని క్యాష్‌ చేసుకోవటానికి పోలిటికల్‌ పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి.. ప్రతి సంవత్సరం రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులకు పొలిటికల్‌ పార్టీల తరుపున ఇఫ్తార్‌ విందులు ఇవ్వటం ఆనవాయితిగా వస్తుంది..


అయితే ఈ సారి ఈ విందులకు దూరంగా ఉండాలి భావిస్తున్నారు ముస్లిం మత పెద్దలు.. చట్టవ్యతిరేఖ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సోమ్ముతో రాజకీయనాకులు ఇచ్చే ఇఫ్తార్‌ విందులను బహిష్కరించాలని.. వరంగల్‌కి చెందిన జామాయత్‌ ఉల్మా ఐ హింద్‌ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసే ఆలోచనలో ఉంది.


అంతేకాదు కొంత మంది ముస్లిం తప్పని సరి పరిస్థితుల్లో అలాంటి ఇప్తార్‌ విందులకు హాజరు కావాల్సిన పరిస్థితులు వస్తే అక్కడ ఎలాంటి విందు స్వీకరించవద్దంటున్నారు.. ముస్లిం మత పెద్దల నిర్ణయంతో పొలిటికల్‌ పార్టీలన్ని ఆలోచనలో పడ్డాయి.