TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుష్కరాలపై మరోసారి వర్మ వివాదాస్పదవ్యాఖ్యలు

Published on: Wed Jul 22, 2015 11:36AM

 

ఎవరో ఒకరిని ఏదో ఒకటి అని.. విమర్శించనిదే మన విమర్శలవర్మ అదే రాంగోపాల్ వర్మకి నిద్ర పట్టదేమో. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూ నలుగురి నోళ్లలో నానితే కాని అయ్యగారికి బావుండదేమో. అందరూ అయిపోయారు ఇప్పుడు అయ్యగారికి పుష్కరాలు గుర్తొచ్చిన్నట్టున్నాయి. మొన్నీమధ్యనే గోదావరి మహా పుష్కరాలకు సంబంధించి జరిగిన తొక్కిసలాట గురించి దేవుడే భక్తులను కాపాడలేకపోయాడు.. పాపం చంద్రబాబు మాత్రం ఏం చేయగలడు అంటూ ట్వీట్స్ చేశారు. చనిపోయిన భక్తులు తక్కువ ప్రార్ధించారేమో అందుకే దేవుడు కాపాడలేదేమో అంటూ దేవుడిని సైతం తన విమర్శలకు బలి చేశాడు. ఇప్పుడు మళ్లీ పుష్కరాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

"అభివృద్ధి చెందిన దేశాలన్నీతమ నదుల్నిశుభ్రంగా ఉంచుకొని మరింత అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పుష్కారాల పేరుతో నదుల్ని కలుషితం చేస్తున్నారు" అని వర్మ తన తాజాగా ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రజలు మండిపడుతున్నారు.