TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'ఎవడు' 31న వస్తున్నాడు

Published on: Tue Jul 23, 2013 11:02AM

 

Ram Charan Yevadu, Ram Charan Yevadu Release, Ram Charan Yevadu Release date

 

 

దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు'. రామ్‌చరణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటించారు. అమీజాక్సన్‌ మరో హీరోయిన్. అల్లు అర్జున్‌, కాజల్‌ అతిథి పాత్రల్లో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

 

''స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' చేసిన పాత్ర ఎవడు కథకు ప్రాణంలాంటిది. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నా సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది'' అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

 

ఎవడు గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...''పవన్ కళ్యాణ్  ''అత్తారింటికి దారేది'' రిలీజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా విడుదల కొన్ని రోజులు వాయిదా వేయాలని అనుకున్నాం. కాని రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్' విడుదలను ఖరారు చేయడంతో...  ప్రత్యామ్నాయం లేక 31న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఘనవిజయం సాధిస్తాయన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.