రామ్ చరణ్ జోక్యంతో వాయిదా పడ్డ ‘నాయక్’ ఆడియో

Publish Date:Dec 7, 2012

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, అందాల భామలు కాజల్ అగర్వాల్, మరియు అమల పాల్ కలిసి నటించిన ‘నాయక్’ సినిమా గురించి అభిమానులు చాల ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని వివివినాయక్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో భారిఅంచనాలే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదటి వారంలోనే ‘ఫస్ట్-లుక్-స్టిల్స్’ రిలీజ్ చేసిన వినాయక్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అది కూడా మంచి యాక్షన్ సీన్లకి సంబందిచినవి కావడంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదటి వారంలోనే సినిమాకి మంచి క్రేజ్ సృష్టించగలిగేడు.

 

ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి బరిలో దిగబోతోందని ముందే ప్రకటించేరు. ఇక, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా ఈనెల 14వ తేదిన హైదరాబాదులో గల శిల్పకళా వేదికలో ఘనంగా జరిపేందుకు ముందు అనుకొన్నపటికీ, రామ్ చరణ్ జోక్యం తో అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్నదానికంటే మరింత భారి ఏర్పాట్లు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరూ పాల్గోనేవిదంగా ఘనంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆతను సలహా ఇచ్చినట్లు తెలిసింది. అందుకే, 14న జరుపదలపెట్టిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదిగాకుండా, ఆ రోజు రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాకోసం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకొంటుంనందువల్ల ఫంక్షన్ మరో రోజుకి వాయిదా వేసుకొంటే బాగుంటుందని దర్శకుడు వినాయక్, నిర్మాత దానయ్య కూడా అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. అందువల్ల త్వరలోనే మరో తేది ప్రకటించే అవకాశం ఉంది.

 

నిర్మాతలు: దానయ్య మరియు రాధాకృష్ణ, బ్యానర్:యూనివర్సల్ మీడియా; దర్శకత్వం:వివి వినాయక్; సంగీతం: తమన్, కేమెర: చోట కే.నాయుడు.