TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెర్రీ మల్టీ స్టారర్ ప్రారంభం

Published on: Thu Feb 6, 2014 2:02PM

 

రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించబోతుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.