TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

Published on: Thu May 12, 2022 4:50PM

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా  57 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న షెడ్యూల్ విడుదల అవుతుంది. నామినేషన్లకు ఈనెల 31 తుదిగడువు. జాన్ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 3వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.  జూన్ 10న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా ఎన్నిక జరగనున్న 57 స్థానాలలో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే ఒక స్థానానికి షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.  ఏపీ నుంచి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, విజయసాయి రెడ్డి, సురేష్ ప్రభుల పదవీ కాలం జూన్ 21తో పూర్తి కానుంది. అలాగే తెలంగాణ నుంచి డిఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీ కాలం కూడా జూన్ 21తో పూర్తి కానున్న సంగతి విదితమే.