జవాన్ల కుటుంబాలకు కోటి పరిహారం...

 

సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  నష్టపరిహారం ప్రకటించారు. మూడు రోజుల సిక్కిం పర్యటనలో భాగంగా శనివారం రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత్‌-చైనా అంతర్జాతీయ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న జవాన్లను కలిశారు. ఈ సందర్బంగా ఆయన విధి నిర్వహణలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారంగా ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు జవాన్ల సమస్యలు తెలుసుకోవడానికే హోం మంత్రిత్వ శాఖ మొబైల్‌ యాప్‌ను రూపొందించిందని ఆయన చెప్పారు. జవాన్ల సమస్యలు తెలుసుకోని వాటిని పరిష్కరించడం మన బాధ్యత, అందుకే యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు.