ఓటు వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌

Publish Date:Apr 24, 2014

 

 

 

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన ఓటుహక్కుని చెన్నయ్‌లో వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో రజనీ ఓటు వేశారు. సినీ నటి విద్యాబాలన్‌ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాక, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ నినాదిస్తున్నారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోకసభ స్థానాలలో ఆరోదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 2076 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్ర 19, ఉత్తరప్రదేశ్ 12, మధ్యప్రదేశ్ 10, బీహార్లో 7, ఛత్తీస్ గఢ్ 7, పశ్చిమబెంగాల్ 6, అస్సాం 6, రాజస్థాన్ 5, జార్ఖండ్ 4, జమ్మూకాశ్మీర్ 1, పుదుచ్చెరి 1 స్థానాల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

By
en-us Political News