TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజయ్య అరెస్ట్

Published on: Wed Nov 4, 2015 2:09PM

 

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండలోని రెవిన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో బుధవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, మనవళ్ళు అభినవ్, అయోన్, శ్రీయోన్‌లు మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణాలపై తమకు హత్య అని అనుమానం వుందని సారిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వాంగ్మూలం నమోదు చేయడం కోసం రాజయ్యతోపాటు ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.